Pawan Kalyan : ఆ నాయకుని ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం : పవన్ కళ్యాణ్

ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో ఉన్న సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చడానికి జనసేన పార్టీ తరపున

Pawan Kalyan : ఆ నాయకుని ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం : పవన్ కళ్యాణ్

Pk

Updated On : October 17, 2021 / 8:43 PM IST

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ సేవా గుణం గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారు. తాజాగా మరోసారి ఆయన దానగుణాన్ని బయటపెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్యని స్మరిస్తూ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారిని గుర్తు చేస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. అయన ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అన్నారు. వృద్దులకు, వికలాంగులకు ఫించన్లు ప్రారంభించింది సంజీవయ్యే అని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూమిని పేదలకి పంచారని, ఆయన తెలుగు మీద మమకారంతో అప్పట్లో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ తెలుగులోనే జరిపించారని తెలిపారు.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ భవిష్యత్తు బొమ్మల్లో పెట్టిన నాగార్జున

ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో ఉన్న సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చడానికి జనసేన పార్టీ తరపున కోటి రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేసి పని ప్రారంభిస్తామని తెలిపారు.