Pawan Kalyan: గాజువాక నా నియోజక వర్గం.. జనసేన జెండా ఇక్కడ ఎగురుతుంది: పవన్ ఇంకా ఏమన్నారంటే?
అంబేద్కర్ ఆశయాలతో తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన పని తాను చేసుకుంటూ పోతానని ఫలితాన్ని ఆశించబోనని అన్నారు.

Pawan Kalyan
Pawan Kalyan – Gajuwaka: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని గాజువాకలో వారాహి విజయ యాత్రలో పాల్గొని వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, గాజువాక నియోజక వర్గంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖలోని గాజువాక తన నియోజక వర్గమని, మన నియోజక వర్గమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ ఆశయాలతో తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన పని తాను చేసుకుంటూ పోతానని ఫలితాన్ని ఆశించబోనని అన్నారు.
భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో సభ అంటే భయపడ్డానని అన్నారు. ఓడిపోయిన తనకు ఎలా అండగా నిలబడతారని అనుకున్నానని చెప్పారు. అయితే, ఊహించని విధంగా రెండు లక్షలకు పైగా జనం వచ్చారని అన్నారు. ఆశయంతో ఉన్న వాడికి గెలుపు, ఓటములు అతీతం అని ఇక్కడి ప్రజలు నిరూపించి నిలబడ్డారని చెప్పారు. దోపిడీ చేస్తాడని తెలిసి కూడా జగన్ కు గెలుపు ఇచ్చారని చెప్పారు. తనకు విధి ఓటమే మిగిల్చిందని అన్నారు.
ఇంకా ఏమన్నారు?
ప్రేమతో స్వాగతం పలికిన గాజువాక నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు
గాజువాకలో ఓడిపోయినట్టు అనిపించదు
గాజువాక నా నియోజకవర్గం
జగన్ లాంటి వ్యక్తి గెలిచి, నేను ఓడుపోవడం దేనికి సంకేతం
ఓడిపోయినే ప్రజలకోసమే నిలబడతాను
అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను
జనసేన ఆశయం ఓడిపోలేదు
ఉత్తరాంధ్రానుంచే నేను పోరాటం నేర్చుకున్నాను
2024 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకలో ఎగురుతుంది
ఏపీకి విశాఖ స్టీల్ ఫ్లాంట్ చాలా కీలకం
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు
విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం భూమిలిచ్చిన రైతులు దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ జీవనం సాగిస్తున్నారు
సీఎం జగన్ స్టీల్ ఫ్లాంట్ పై ఒక్క మాట మాట్లాడరు
విశాఖ ఎంపీ ఒక రౌడీషీటర్
స్టీల్ ఫ్లాంట్ పై 30 మంది ఎంపీలు ఒక్కరు మాట్లాడరు
ప్రధానమంత్రి ఎందుకు వినరు?
కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది?
రుషికొండను విధ్వంసం చేస్తే ధైర్యం ఎలా వస్తుంది
లూటీ చేస్తే, ధైర్యం ఎలా వస్తుంది?
ఆంధ్రా ఎంపీలు అంటే ఢీల్లీలో చులకన
ఇక్కడ క్రైస్తవ సంఘం భూములను దోచేస్తున్నారు
స్టీల్ ఫ్లాంట్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కేంద్ర పెద్దలను కోరాను
ఎంపీలు లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు కాని ముందుకు వెళ్లరు
కేంద్రాన్ని ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను
గంగవరం, దిబ్బపాలెం రెండు మత్స్యకార గ్రామాలను గాలికి వదిలేశారు
ప్రజలకు ప్రభుత్వంపై కోపం, వ్యతిరేకత ఉంది
గంగవరం ప్రజలకు న్యాయం చేయకపోతే, నేను పోరాడతాను
విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం భూమిలిచ్చిన రైతులు దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ జీవనం సాగిస్తున్నారు
సీఎం జగన్ స్టీల్ ఫ్లాంట్ పై ఒక్క మాట మాట్లాడరు
విశాఖ ఎంపీ ఒక రౌడీషీటర్
దసపల్లా, సిరిపురం, రుషికొండ భూములను, ఉత్తరాంధ్రా భూములను దోచేస్తున్నారు
తెలంగాణలో ఏపీ ప్రజలకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడడం లేదు?
నాకు కుదిరితే విశాఖను నా రెండో ఇంటిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను
పోలీస్ శాఖకు ఎప్పుడూ సొంత అభిప్రాయం ఉండదు
పోలీసులకు కూడా మనస్సు ఉంటుంది.. పోలీసులకు చాలా కష్టాలు ఉన్నాయి
జనసేన పోలీసుల సమస్యలపై పోరాడుతుంది
జగన్ చేసే దోపిడీలకు, పోలీసులు రోడ్లు మీదకు రావల్సివస్తుంది
30 వేల మంది మహిళలు ఎందుకు అదృశ్యం అయ్యారు?
వాలంటీర్ లకు హెడ్ ఎవ్వరు
ఏపీలో ఐటీని ఎందుకు అభివృద్ధి చేయలేదు?
ప్రజలు నావెంట నిలబడితే, ఐటీని అధ్భుతంగా అభివృద్ధి చేస్తాను
రుషికొండపై దేవుడు ఉంటే, నేను అనుకూలం
రుషికొండ మీద రౌడీలు ఉంటే నేను వ్యతిరేకం
పంచగ్రామాలకు నేటికి న్యాయం జరగలేదు
క్రిమినల్ వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాడు జగన్
జగన్ ను అదృష్టం అందలం ఎక్కించింది-బుధ్ధి బురదలోకి లాక్కి వెళ్ళింది
ప్రజల గుండెల్లో స్థానం ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కంటే గొప్పది
నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే అవ్వను
పని చేసుకుంటూ వెళతాను
నేను ముఖ్యమంత్రి స్థానాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాను
మన ప్రభుత్వం రానీ-మిశ్రమ ప్రభుత్వం రానీ
జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకుడదు
ఓట్లు చీలిపోకూడదని మాట్లాడుతున్నాను.. అంటే జగన్ సీఎం అవ్వకూడదనే