Pawan Kalyan: ఏపీ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కీలక సమావేశాలు
ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపిక కోసం సమీక్షలు పూర్తి చేశారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాల్లో జనసేన అభ్యర్థులపై..

Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో జనసేన నుంచి కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక సీట్లు కేటాయించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
జనసేన గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై పవన్ ఇప్పటికే సర్వే చేయించారు. ఆ స్థానాల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలను కూడా రచించుకున్నారు. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపిక కోసం సమీక్షలు పూర్తి చేశారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాల్లో జనసేన అభ్యర్థులపై పవన్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు రెండవ విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడలో గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్ష నిర్వహించనున్నారు. జనసేన పార్టీ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా జనసేన నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఇటీవల నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు, ఏపీ సీఎం అభ్యర్థి వంటి అంశాలపై కూడా తమ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు.
Bandaru: సీఎం జగన్ తల్లి, చెల్లితో పాటు వీరందరితోనూ ఆడుకున్నారు: మాజీ మంత్రి బండారు