Bandaru: సీఎం జగన్ తల్లి, చెల్లితో పాటు వీరందరితోనూ ఆడుకున్నారు: మాజీ మంత్రి బండారు

వైఎస్ షర్మిల క్రిస్మస్ వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు చెప్పడం..

Bandaru: సీఎం జగన్ తల్లి, చెల్లితో పాటు వీరందరితోనూ ఆడుకున్నారు: మాజీ మంత్రి బండారు

jagan-bandaru

Updated On : December 26, 2023 / 3:51 PM IST

TDP: జగన్ సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య, అంగన్వాడీ, భవన నిర్మాణ కార్మికులను జగన్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.

సొంత చెల్లి, తల్లితోనూ జగన్ ఆడుకున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ ఆడుకున్నారని చెప్పారు. న్యాయస్థానాలతో కూడా ఈ జగన్ ఆటలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆడుకుందాం ఆంధ్రా అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.

కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న సమయంలో దానిపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. రాంగోపాల్ వర్మను దర్శక, నిర్మాత మండలి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిల క్రిస్మస్ వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు చెప్పడం హర్షణీయమన్నారు.

MLA Malladi Vishnu : ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహా నాయకుడు వంగవీటి రంగా