MLA Malladi Vishnu : ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహా నాయకుడు వంగవీటి రంగా
జైల్లో ఉండి వంగవీటి మోహన్ రంగా కార్పొరేటర్ గా విజయం సాధించారని, 1985లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో వంగవీటి రంగా శాసనసభలో అడుగు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

Malladi Vishnu
Vangaveeti Ranga Death Anniversary : వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో రంగా విగ్రహంను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జైల్లో ఉండి వంగవీటి మోహన్ రంగా కార్పొరేటర్ గా విజయం సాధించారని, 1985లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో వంగవీటి రంగా శాసనసభలో అడుగు పెట్టారని, పేద ప్రజల సమస్యలకోసం అనేక ఉద్యమాలు చేశారని అన్నారు.
Also Read : Telangana High Court : ‘వ్యూహం’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా.. సినిమా విడుదలపై స్టేకు నిరాకరణ
లాకప్ డెత్ లు, పోలీసుల ధమనకాండకు, టీడీపీ నేతలు అరాచకాలకు రంగా ఎదురువెళ్లేవారని, ఎన్టీ రామారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహా నాయకుడు వంగవీటి రంగా అని మల్లాది విష్ణు అన్నారు. మొగల్రాజపురంలో పేద ప్రజల ఇళ్ల పట్టాలు విషయమై వెళ్తున్న రంగాను పోలీసులు అరెస్ట్ చేయడంతో నిరాహార దీక్ష చేశారని, నిరాహార దీక్షలో అగంతుకుల చేతిలో రంగ హత్య చేయబడ్డాడని అన్నారు. వంగవీటి రంగా స్ఫూర్తితో అనేక మంది రాజకీయాల్లో ఉన్నారని, వంగవీటి మోహన్ రంగా ఏ ఇళ్ల పట్టాలకోసం ప్రాణార్పణ చేశారో.. దానికి అనుగుణంగా సీఎం జగన్ విజయవాడ నగరంలో మూడువేల ఇళ్ల పట్టాలు జీవో తెచ్చారని అన్నారు. ఎవరైనా రాజకీయాల్లో ముందుకు వెళ్లాలంటే వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకోవాలని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
Also Read : Hyderabad : శామీర్‌పేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. నగలు దోపిడీచేస్తున్న వీడియో వైరల్
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగాను చంపింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. ఉన్నత వర్గాల మీద వంగవీటి రంగా ఉద్యమాలు చేశారని అన్నారు. సీఎం జగన్ వంగవీటి రంగా ఆశయాలకు అనుగుణంగా ఇళ్ల పట్టాలు అందించారని, పేదల రక్తాన్ని పీల్చేది చంద్రబాబు నాయుడు, పేదల పక్షపాతి జగన్ అని అడపా శేషు అన్నారు.
వంగవీటి రంగాకు అంబటి నివాళి ..
వంగవీటి మెహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి అంబటి రాంబాబు నివాళులర్పించారు. ఈ మేరకు ట్విటర్ (ఎక్స్) లో ఫొటో షేర్ చేశారు. ‘దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 35 సంవత్సరాలు.. జోహార్ వంగవీటి రంగా’ అని రాశారు.
దీక్షలో వున్న ధీరుణ్ణి
టిడిపి గూండాలు హతమార్చి
నేటికి 35 సంవత్సరాలు"జోహార్ వంగవీటి మోహన రంగా"! pic.twitter.com/k6E8cOEWzv
— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2023