Telangana High Court : ‘వ్యూహం’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా.. సినిమా విడుదలపై స్టేకు నిరాకరణ
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు..

Telangana High Court
Vyooham : రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ పై ఇవాళ విచారణ జరిగింది. వ్యూహం సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే, స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 28వ తేదీన విచారించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.
Also Read : RGV Vyooham: వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్లో మంత్రులు రోజా, అంబటి, జోగి రమేశ్ ఏమన్నారో తెలుసా?
హైకోర్టులో విచారణ ప్రారంభమైన తరువాత టీడీపీ తరపున మురళీధర్ రావ్ వాదనలు వినిపించారు. వ్యూహం చిత్రంలో రాజకీయాలకు సంబంధించిన పాత్రలను పెట్టారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తెసిందన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేం చేసేలా సినిమా తీశారని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చెయ్యాలని హైకోర్టును కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రస్తుతం కోర్ట్ లో ఉంది.. కానీ, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కు పాల్పడి చంద్రబాబుకు కిక్ బ్యాక్స్ వచ్చాయని చూపించారు . సోనియా, మన్మోహన్, రోశయ్య పాత్రలను నెగిటివ్ గా చూపించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సెన్సార్ బోర్డుకుకూడా దీనిపై ఫిర్యాదు చేశామని తెలిపారు.
Also Read : Vyooham movie: ఆర్జీవీ వ్యూహానికి.. నారా లోకేశ్ ప్రతి వ్యూహం.. ఇక ఆ సినిమా..
వ్యూహం సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నది రామదూత క్రియేషన్స్ అని.. ప్రొడ్యూసర్ అడ్రస్ కూడా వైసీపీ పార్టీకి చెందిన కార్యాలయంలోనే ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వ్యూహం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బహిరంగంగానే బాబు, పవన్ లు తనకు ఇష్టం లేదని ఆర్జీవీ చెప్పాడని, వ్యూహం సినిమా మొత్తం చంద్రబాబును కించపర్చేందుకే తీశారని, ఈ సినిమా ఫంక్షన్ లకు సైతం వైసీపీ మంత్రులు హాజరయ్యారని పేర్కొంటూ సినిమా ట్రైలర్, సాంగ్ ల పెన్ డ్రైవ్ లను టీడీపీ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలపై ఈ సినిమా తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది. అయితే, వ్యూహం సినిమా ఈనెల 29న విడుదల కావాల్సి ఉంది.