Pawan Kalyan : పెడనలో నాపై రాళ్లదాడి చేస్తారని సమాచారం, నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పెడన వారాహి యాత్రలో నా మీద రాళ్ల దాడి చేస్తారని సమాచారం అందింది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండు నుంచి మూడు వేలమంది నాపై రాళ్లదాడి చేసేందుకు వస్తారని సమాచారం వచ్చింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Pawan Kalyan : పెడనలో నాపై రాళ్లదాడి చేస్తారని సమాచారం, నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan Pedana Varahi Yatra : పెడన వారాహి యాత్రలో నా మీద రాళ్ల దాడి చేస్తారని సమాచారం వచ్చింది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు నుంచి మూడు వేలమంది తనపై రాళ్లదాడి చేసేందుకు వైసీపీ ప్లాన్ వేసిందని సమాచారం వచ్చింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిలీపట్నంలో మంగళవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనపై ఎటువంటి దాడి జరిగినా హోంమంత్రి, డీజీపీయే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

తనపై దాడి చేసేందుకు రెండు నుంచి మూడు వేలమంది వస్తారని తనకు సమాచారం అందిందని తెలిపిన పవన్.. తనపై దాడి జరిగితే జనసేన సైనికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను రియాక్ట్ అవ్వవద్దని సూచించారు. ఎవ్వరు ఎదురు దాడికి దిగవద్దని సూచించారు. కత్తులు, రాళ్లు తీసుకుని ఎవరైనా వచ్చినట్లుగా గుర్తిస్తే వారిని పట్టుకుని బంధించండి వారి చట్టానికి అప్పగిద్దాం. అంతే తప్ప ఎవ్వరు ఎదురు దాడికి దిగవద్దని సూచించారు. తనపై రౌడీయిజం చూపిస్తే చూస్తూ
ఊరుకోను అంటూ హెచ్చరించారు. క్రిమినల్ వేషాలు వస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

Also Read : జగన్ అధికారంలోకి రావటానికి ఇష్టమొచ్చినట్లుగా హామీలిచ్చారు, కానీ వాటి అమలు మాత్రం లేదు : పవన్ కల్యాణ్

కాగా నాలుగో విడత వారాహి యాత్రను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో ప్రారంభించారు. అవనిగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై పలువురు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. అక్టోబర్ 4న పెడన, అక్టోబర్ 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పెడన వారాహి సభలో తనపై రాళ్లదాడి జరుగుతుందని.. మూడు వేలమంది దాడికి పాల్పడవచ్చనే సమాచారం అందింది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Also Read: సైకిల్- గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ కల్యాణ్ వైఖరి మారిందా?