Pawan Kalyan : జగన్ అధికారంలోకి రావటానికి ఇష్టమొచ్చినట్లుగా హామీలిచ్చారు,కానీ వాటి అమలు మాత్రం లేదు : పవన్ కల్యాణ్

జగన్ అధికారంలోకి రావటానికి ఇష్టమొచ్చినట్లుగా హామీలు గుప్పించారని కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. హామీలు ఇచ్చిన జగన్ ని ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి క్లాస్ వార్ చేస్తున్నారు అంటూ విమర్శించారు.

Pawan Kalyan : జగన్ అధికారంలోకి రావటానికి ఇష్టమొచ్చినట్లుగా హామీలిచ్చారు,కానీ వాటి అమలు మాత్రం లేదు : పవన్ కల్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan Machilipatnam Janavani program : నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాలోని మంచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఎంతోమంది బాధితులు పవన్ కల్యాణ్ కు తమ బాధలు వినిపించారు. వినతిపత్రాలు ఇచ్చారు. తమ సమస్యల్ని జనవాణి కార్యక్రమంలో పవన్ తో చెప్పుకున్నారు.

బాధితుల నుంచి వినతపత్రాలు స్వీకరించిన పవన్ కల్యాణ్ మాట్లాడుతు..జగన్ అధికారంలోకి రావటానికి ఇష్టమొచ్చినట్లుగా హామీలు గుప్పించారని కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. హామీలు ఇచ్చిన జగన్ ని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. 151 సీట్లు ఇచ్చి అఖండ విజయాన్నిచ్చారు. కానీ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి క్లాస్ వార్ చేస్తున్నారు అంటూ విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎయిడెడ్ విద్యా సంస్థలను రద్దు చేసిందని విమర్శించారు.

supreme court : అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోమన్న ధర్మాసనం

స్మార్ట్ మీటర్లతో ప్రజలకు భారం మోసింది ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలకు భారం తప్ప ఏమీ ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల కోసం జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు.

కాగా నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా  పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు. మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపానికి వచ్చిన పవన్..జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ రెండు గంటలపాటు మౌన దీక్ష చేపట్టారు. పవన్ తో పాటు సంఘీభావంగా జనసేన నేతలు నాదెండ్ల మనోహర్ తదితరులు దీక్ష చేపట్టారు.