supreme court : అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోమన్న ధర్మాసనం

అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోబోము అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది.

supreme court : అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోమన్న ధర్మాసనం

supreme court

Angallu Case : అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోబోము అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో అంగళ్లులో జరిగిన ఘర్షణలో పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అయినా ధర్మాసనం మాత్రం పుంగనూరు, అంగళ్ళు దాడి కేసులో నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఈ తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

కాగా..చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబు కారణమని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు 20మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.

Also Read: పార్టీ పెట్టి 20ఏళ్లు కష్టపడితేనే మాయావతి సీఎం అయ్యారు, టీనేజ్‌లోనే జగన్ అలా చేశారు అందుకే మద్దతివ్వలేదు- పవన్ కల్యాణ్

ఈకేసుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 79మంది టీడీపీ నేతలకు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పుని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. టిడిపి నేతల ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేం అని స్పష్టంచేస్తు తీర్పునిచ్చింది. పుంగనూరు, అంగళ్ళు దాడి కేసులో నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టంచేయటంతో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన మొత్తం  ఆరు పిటీషన్లను కొట్టివేసింది. కాగా.. అంగళ్ల కేసులో దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.