మాకు ఒక్క రోజు వస్తుంది : పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

  • Published By: madhu ,Published On : December 12, 2019 / 01:05 PM IST
మాకు ఒక్క రోజు వస్తుంది : పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Updated On : December 12, 2019 / 1:05 PM IST

తమకు ఒక్క రోజు వస్తుంది..ఆ ఒక్క రోజున..భస్మీపటాలై పోతారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమకు తిట్లు రావా ? తాను వీధి బడిలో చదువుకున్నా..భాష ఎలా ఉంటదో తెలుసు కదా అన్నారు. బాహాబాహికి సిద్ధం అంటే..తాను రెడీ అంటానని పవన్ ప్రకటించారు.

2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొన్న పవన్ దీక్షను సాయంత్రం 6గంటలకు విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్..రైతుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

తనకు ప్రాణాలపై ఆశ లేదని, గొడవలు పెట్టుకోవడానికి సిద్ధం..కానీ..అంతకుముందు..సామ, దాన, భేదం పూర్తయి పోవాలన్నారు. ఓపిక పడుతా..ఛీ కొట్టిన భరిస్తా…అయితే తమకు ఒక్క రోజు వస్తుంది… ఆ ఒక్క రోజు రాకూడదని ప్రార్థించుకోవాలని వైసీపీని ఉద్దేశించి అన్నారు. తమ సహనం..బలహీనత కాదని..ఏదో ఒకటి మాట్లాడడం కరెక్టు కాదన్నారు.

ఎవరూ తక్కువ లేరు..భయపడి వెనక్కి అడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము ఉన్నది రైతుల సమస్యల పరిష్కారానికై అని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు నిగ్రహంగా ఉండాలి..ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కాదని సూచించారు. తమకు సంస్కారం ఉందని, చట్టాలను చేసే వారు..ధిక్కరించే వారు కాదు..అని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పారు. 
Read More : పదవుల కోసం కాదు..ప్రజల కోసం : పవన్ దీక్ష విరమణ