Pawan Kalyan: నరసాపురంకు పవన్ కళ్యాణ్.. రేపే బహిరంగ సభ!

రేపు అనగా.. ఫిబ్రవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ.

Pawan Kalyan: నరసాపురంకు పవన్ కళ్యాణ్.. రేపే బహిరంగ సభ!

Pawan Kalyan

Updated On : February 19, 2022 / 2:39 PM IST

Pawan Kalyan: రేపు అనగా.. ఫిబ్రవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ‘మత్స్యకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నరసాపురం రుస్తుం బాద్‌లో రేపు సాయంత్రం మత్స్యకార అభ్యున్నతి సభలో ప్రసంగించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నరసాపురానికి చేరుకుంటారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి.

ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టి పెట్టే సమయం, ఆలోచన రెండూ లేవంటూ ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మత్స్యకారుల కోసం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జీవోపై గళమెత్తడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా పార్టీ ప్రకటనలో తెలిపింది.