Pawan Kalyan : స్టాలిన్ పనితీరు అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకం – పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ని అభినందించారు. మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంశించారు.

Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ని అభినందించారు. మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంశించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు.. అన్ని పార్టీలకు మార్గదర్శకం స్ఫూర్తిదాయకం.. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాని తెలుగు తమిళ భాషల్లో ట్వీట్ చేశారు పవన్.
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021