Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర.. కాకినాడ జిల్లాలో ఏడో రోజు

మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో పవన్ సమావేశం కానున్నారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుండి బయలు దేరనున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర.. కాకినాడ జిల్లాలో ఏడో రోజు

Pawan Kalyan (2)

Updated On : June 20, 2023 / 8:57 AM IST

Varahi Vijaya Yatra : ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. జిల్లాలో వారాహి విజయ యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈరోజు (మంగళవారం) కాకినాడ జిల్లా నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వారాహి విజయ యాత్ర వెళ్ళనుంది.

మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో పవన్ సమావేశం కానున్నారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుండి బయలు దేరనున్నారు. యానం నుండి ర్యాలీగా ముమ్మిడివరం నియోజక వర్గం చేరుకోనున్నారు.

Anita Letter : జాతీయ మహిళా కమిషన్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ‍

రేపు (బుధవారం) ముమ్మిడివరం బహిరంగ సభలో పవన్ పాల్గొనున్నారు. ఈ రోజు (మంగళవారం) నుండి వారాహి అమ్మవారు నవరాత్రి దీక్షలు ప్రారంభం కావడంతో పవన్ ఉపవాస దీక్ష చేయనున్నారు. మంగళవారం నుండి పాలు, పళ్ళు మాత్రమే తీసుకోనున్నారు.