రేపటి నుంచి శ్రీశైలం దేవాలయ దర్శనానికి అనుమతి

  • Published By: bheemraj ,Published On : August 13, 2020 / 09:38 PM IST
రేపటి నుంచి శ్రీశైలం దేవాలయ దర్శనానికి అనుమతి

Updated On : August 13, 2020 / 10:19 PM IST

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 14, 2020) ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఈ మేరకు ఆలయ ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.

10 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసులోపు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.