Fake IPS : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో కలకలం.. నకిలీ పోలీస్ హల్చల్..
ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న సూర్యప్రకాశ్ కు కొందరు అధికారులు సెల్యూట్ కొట్టి ఫొటోలు దిగడంపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు.

Fake IPS : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో హల్ చల్ చేసిన నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. విజయనగరం ముడిదాం ప్రాంతానికి చెందిన బలివాడ సూర్యప్రకాశ్ రావుగా గుర్తించారు. విజయనగరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నాడు? ఏదైనా ప్లాన్ ప్రకారం వేసుకున్నాడా? అనే కోణంలో విచారించారు. మరోవైపు డిప్యూటీ సీఎం మన్యం పర్యటనలో భద్రతాలోపంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కల్యాణ్ చుట్టూ సూర్యప్రకాశ్ రావు తిరుగుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న సూర్యప్రకాశ్ కు కొందరు అధికారులు సెల్యూట్ కొట్టి ఫొటోలు దిగడంపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. హోంమంత్రి విచారణకు ఆదేశించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
‘తాండ్ర పాపారాయుడి కాలేజీలో బీటెక్ చదివాడు. 2005-2009 నుంచి ఈసీఈ చదువుకున్నాడు. ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాడు. 2003-2005 వరకు ఇండియన్ ఆర్మీలో సిపాయిగా పని చేశాడు. కొంత కాలం పని చేసి వచ్చేశాడు’ అని పోలీసులు తెలిపారు.
మరోవైపు నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాశ్ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యప్రకాశ్ అసలు బాగోతాన్ని కుటుంబసభ్యులు బయటపెట్టారు. ఆస్తి కోసం, డబ్బు కోసం కన్న తల్లిని, సొంత తమ్ముడిని, కుటుంబాన్ని బెదిరించాడని వాపోయారు. రూ.70 లక్షల వరకు బంగారం, నగదు, ఆస్తులు కాజేసి తమను రోడ్డున పడేశాడని కన్నీటిపర్యంతం అయ్యారు.
Also Read : ఏపీ సీఎస్ గా విజయానంద్ నియామకం.. ఎవరీ విజయానంద్..
Also Read : సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు వద్దంటూ ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రచారం