Nellore : వీడిన తేజస్విని డెత్ మిస్టరీ

నెల్లూరు జిల్లాలో గూడూరు తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

Nellore : వీడిన తేజస్విని డెత్ మిస్టరీ

Nellore

Updated On : July 2, 2021 / 3:42 PM IST

Nellore : నెల్లూరు జిల్లాలో గూడూరు తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ప్రియుడు వెంకటేష్ తేజస్వినిని హత్యచేసి ఆ తర్వాత ఉరివేశాడని గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కేసు విచారణ వేగవంగం చేసినట్లు డీఎస్పీ వివరించాడు. ప్రేమించలేదని కోపంతోనే వెంకటేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే

నెల్లూరు జిల్లా గూడూరులో సుధాకర్-సరిత దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తె తేజస్విని ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇదే క్రమంలో సుధాకర్ సహచర ఉద్యోగి చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేష్.. తేజస్వినికి దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అది కొన్నాళ్ళకు ప్రేమగా మారింది. ఏడాది కాలంగా వెంకటేష్ ప్రవర్తనతో విసుగు చెందిన తేజస్విని అతడిని దూరం పెట్టింది.

ఈ నేపథ్యంలోనే అతడు తేజస్వినిపై కోపం పెంచుకున్నాడు. తేజస్విని ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో ప్రవేశించి ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం చున్నీతో గొంతు బిగించి హత్యచేశాడు. ఇదే సమయంలో అనుమానం రాకుండా ఉండేందుకు వెంకటేష్ చున్నీతో కిటికీకి ఉరివేసుకున్నాడు. వీరిని గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే తేజస్విని మృతి చెందింది. వెంకటేష్ కోలుకున్నాడు.

తేజస్వినిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం రిపోర్టులో కత్తిపోట్లు కనిపించడంతో హత్యగా నిర్దారించారు. ప్రియుడు వెంకటేష్ ఈ హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేష్ తోపాటు అతడి వెంట వచ్చిన స్నేహితుడిపై కేసు నమోదు చేశారు.