Visakhapatnam: నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు.. ఐదో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్

నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీస్, నలుగురిని పెళ్లి చేసుకొని ఐదో పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Visakhapatnam: నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు.. ఐదో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్

Visakhapatnam

Updated On : October 4, 2021 / 3:23 PM IST

Visakhapatnam  : నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీస్, నలుగురిని పెళ్లి చేసుకొని ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ సీసీఆర్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అప్పలరాజు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఇప్పటికి నలుగురు మహిళలను పెళ్లిచేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని ఐదుగురు పిల్లలకు తండ్రయ్యాడు. తాజాగా మరో మహిళా కానిస్టేబుల్ తో ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు.

Read More : cheddi gang : తిరుపతి నగరంలో చెడ్డీగ్యాంగ్ కలకలం..అప్రమత్తమైన పోలీసులు

ఈ విషయం తెలిసిన నలుగురు భార్యల్లో ఒకరైన పద్మ అప్పలరాజును నిలదీసింది. అనంతరం దిశా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో గురుడి పెళ్లిళ్ల గుట్టు బయటపడింది. పద్మతోపాటు మరో ముగ్గురిని పెళ్లాడాడని విచారణలో తేలింది. ఇక హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు చేతిలో మోసపోయిన మహిళలకు అండగా ఉంటామని చేతన స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. అప్పలరాజును ఉద్యోగం నుంచి తొలగించాలని చేతన సంస్థ సభ్యులు డిమాండ్ చేశారు.

Read More : SRK’s Son : ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు..వాదించే క్రిమినల్ లాయర్ ఎవరు ?