MLA Hafeez Khan : ఖురాన్ పట్టుకుని కర్నూల్‌లో లోకేశ్ కోసం వేచి చూస్తున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ .. ఆరోపణల్ని నిరూపించాలని సవాల్
ఎటువంటి కబ్జాలు చేయలేదని మసీద్ లో ఖురాన్ పై ప్రమాణం చేస్తా.. మరి లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయగలరా? అంటూ సవాల్ విసిరారు YCP ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచిచూస్తుండటంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Nara Lokesh Comments
MLA Hafeez Khan: టీడీపీ నేత నారా లోకేష్ ((Nara Lokesh))పాదయాత్ర (Padayatra) లో స్థానిక వైసీపీ (YCP leaders) నేతలు చేస్తున్న భూ కబ్జాలు, ఇసుక దందాల గురించి విమర్శలు సంధిస్తు కొనసాగుతున్నారు. లోకేశ్ పాదయాత్రకు మంచి స్పందన రావటం ప్రజల్లో లోకేశ్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. సర్వే నంబర్లతో సహా చెబుతు లోకేశ్ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న క్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై ఆరోపణలు చేశారు.
హఫీజ్ ఖాన్ స్దానికంగా ఉన్న పలు స్ధలాల్ని ఆక్రమించుకుంటున్నట్లు లోకేష్ ఆరోపణలు చేశారు.లోకేశ్ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, అప్పుడే కర్నూలు (Kurnool) దాటి వెళ్లాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ (Kurnool MLA Hafeez Khan) డిమాండ్ చేశారు. నారా లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నీవు ఉన్న టెంటు దగ్గరకు వస్తా అక్కడే చర్చిద్దాం. నాపై ఆరోపణలు రుజువు చేయకపోతే నారా లోకేశ్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. డిమాండ్ చేయటమే కాకుండా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచి చూస్తున్నారు. నేను ఎటువంటి కబ్జాలు చేయలేదని మసీద్ లో ఖురాన్ పై ప్రమాణం చేస్తానంటున్నారు. మరి లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయగలరా? అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచిచూస్తుండటంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లోకేశ్ పాదయాత్ర వచ్చే మార్గంలో హఫీజ్ ఖాన్ వేచి చూస్తుండటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
కాగా లోకేశ్ పాదయాత్రలో పలువురు స్థానిక వైసీపీ నేతలపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిపై చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే కర్నూ, పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కూడా లోకేశ్ అవినీతి ఆరోపణలు చేశారు.
కాగా..లోకేష్ పాదయాత్ర చేస్తూ టీడీపీని బలోపేతం చేసే దిశగా వెళుతున్నారు.అదే సమయంలో టీడీపీ చేసిన సంక్షేమాలను..అభివృద్ది గురించి చెబుతునే మరోపక్క వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఇసుక దందాల గురించి చెప్పుకొస్తు సెటైర్లు వేస్తున్నారు. తీవ్ర ఆరోపణలతో వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం వైసీపీ పాలనకు ఉన్నాడలను ప్రజలకు వివరిస్తున్నారు. దీంట్లో భాగంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే క్రమంలో లోకేష్ వ్యూహాత్మకంగా ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..ఆ ప్రాంతపు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తు విమర్శలు, ఆరోపణలు హీటెక్కిస్తున్నారు.
Paritala Sreeram: పరిటాల రవి పేరు ఎక్కువగా తలచుకుంటున్నావు.. ధన్యవాదాలు..