వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్

Updated On : June 21, 2021 / 1:29 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో  పాజిటివ్ రావటంతో బాధితులు  ఆశ్చర్యానికి గురువుతున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు కుచెందిన వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.  వైరస్ లక్షణాలు లేకపోయినా …. పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావటంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లి పోయారు. ఈ విషయాన్ని ఆయన వీడియో ద్వారా తెలిపారు. తనకు కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలిందని…..తనకు ఎలాంటి జలుబు, దగ్గు జ్వరం లక్షణాలు లేవని చెప్పారు.

పాజిటివ్ రావటం వల్ల తాను ఎవరిని ప్రత్యక్షంగా కలవనని..నియోజక వర్గ ప్రజలకు ఫోన్ ద్వారా వాట్సప్ ద్వారా అందుబాటులో ఉంటానని.. త్వరలోనే తాను కోలుకుని బయటకు వస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.