Pothina Mahesh: పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రను అడ్డుకుంటే ఊరుకోము: జనసేన

నాదెండ్ల మనోహర్ పేరును ఎత్తే అర్హత కూడా అంబటి రాంబాబుకు లేదని చెప్పారు. నోరుందని..

Pothina Mahesh: పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రను అడ్డుకుంటే ఊరుకోము: జనసేన

Pothina Mahesh

Updated On : October 2, 2023 / 3:45 PM IST

Janasena Party: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మచిలీపట్నంలో జనసేన నేత పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులను అడ్డు పెట్టుకుని వారాహి యాత్రను అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

అంబటి రాంబాబు మంచి వ్యక్తిలా పోజులు కొడుతున్నారని పోతిన మహేశ్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి ఎన్నో ఒట్టి మాటలు చెబుతారని అన్నారు. నాదెండ్ల మనోహర్ పేరును ఎత్తే అర్హత కూడా అంబటి రాంబాబుకు లేదని చెప్పారు. నోరుందని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు.

సింహాద్రి రమేశ్ కు నిన్న పవన్ వారాహి యాత్ర చూసి మైండ్ బ్లాంక్ అయిందని పోతిన మహేశ్ చెప్పారు. అవనిగడ్డ, శ్రీకాకుళంలో సింహాద్రి రమేశ్ ఇసుక కొండలు సృష్టించారని ఆరోపించారు. అక్రమ సంపాదనతోనే వైసీపీ పార్టీ నడుపుతోందని చెప్పారు. జనసేన పార్టీ గురించి మాట్లాడే అర్హత వైసీపీలో ఏ నాయకుడికీ లేదని అన్నారు.

Murali Mohan : చంద్రబాబు అరెస్టుపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు