Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజుకో వివాదం చోటుచేసుకుంటుంది. నిన్నటివరకు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ విషయంలో విమర్శలు చేసుకున్నారు ఇరు రాష్ట్రాల నేతలు. ఇక తాజాగా విద్యుత్ జగడానికి తెరలేచింది

Telugu States
Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజుకో వివాదం చోటుచేసుకుంటుంది. నిన్నటివరకు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ విషయంలో విమర్శలు చేసుకున్నారు ఇరు రాష్ట్రాల నేతలు. ఇక తాజాగా విద్యుత్ జగడానికి తెరలేచింది. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డును కోరింది.
ఈ మేరకు జూన్ 17న కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డుకు ఈఎస్సీ నాగిరెడ్డి లేఖ రాశారు. కనీస డ్రాయింగ్ లెవెల్స్ 834 అడుగులుగాగా పేర్కొన్నారు నాగిరెడ్డి. కానీ 808.4 అడుగుల ఉన్నప్పుడే నీటిని విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఉత్పత్తిని కొనసాగించాలని జెన్ కోకు తెలిపింది. ఈ మేరకు జెన్ కో, నీటిపారుదల శాఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలకు అత్యధిక విద్యుత్ అవసరమవుతుందని, విద్యుత్ ఉత్పత్తి నిలిస్తే నీటి ఎత్తిపోతకు ఆటంకం వాటిల్లుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల మధ్య.. జల, విద్యుత్ జగడాలు చోటుచేసుకుంటున్నాయి.