Prisoner Escape : తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ పరార్
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ పరార్ అయ్యాడు. కడప కేంద్ర కారాగారంలో రామచంద్రప్ప అనే వ్యక్తి జీవిత ఖైదుగా ఉన్నాడు. కొంతకాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

Prisoner
Tirupati Swims Hospital : తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ పరార్ అయ్యాడు. కడప కేంద్ర కారాగారంలో రామచంద్రప్ప అనే వ్యక్తి జీవిత ఖైదుగా ఉన్నాడు. గత కొంతకాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
అనారోగ్యంగా ఉండటంతో చికిత్స కోసం అతన్ని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే రామచంద్రప్ప పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్య హత్య కేసులో రామచంద్రప్ప జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
Prisoners escape : జైలు నుంచి 13మంది కోవిడ్ ఖైదీలు పరార్
గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. చికిత్స కో్సం ఖైదీలను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పారి పోయిన ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడిన ఖైదీలు జైలు నుంచి పరార్ అయ్యారు.