Prudhvi Raj: మంత్రి రోజాపై సినీనటుడు పృథ్వీరాజ్ కామెంట్స్

జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి డ్యాన్సులకు అంబటి రాంబాబును పిలుస్తామని అన్నారు.

Prudhvi Raj: మంత్రి రోజాపై సినీనటుడు పృథ్వీరాజ్ కామెంట్స్

Prudhvi Raj

Updated On : February 10, 2024 / 8:12 PM IST

శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మొత్తం 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలను టీడీపీ-జనసేన కూటమి గెలుచుకుంటుందని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. నంద్యాలలో ‘జనసేన కోసం మెగా సైన్యం’ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీ మాట్లాడారు.

డైమండ్ రాణి మీద అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయని, తమ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె మీద విచారణ జరిపిస్తామని పథ్వీరాజ్ తెలిపారు. ఒక దరిద్రుడు జైలుకు పోతే ఇంకో దరిద్రుడు జైలుకు పోయి మద్దతు ఇచ్చారంటూ రోజా అన్నారని చెప్పారు. ప్రతి ఇంట్లో జగన్ ఫొటో పెట్టుకోవడానికి ఆయన బాపూజీనా, జవహర్ లాల్ నెహ్రునా లాల్ బహదూర్ శాస్త్రినా అని ప్రశ్నించారు.

ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం బతుకుతున్నామని చెప్పారు. మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లిని, తల్లిని పక్కన పెట్టిన జగన్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మెగా ఫ్యాన్స్ అందరూ జనసేనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.

మెగా ఫ్యాన్స్ అందరూ కూటమికి మద్దతు తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పృథ్వీ చెప్పారు. నారా లోకేశ్ లోశేష్ వద్ద రెడ్ డైరీ ఉందని తెలిపారు. అలాగే, తనవద్ద కూడా ఒక డైరీ ఉందని, అది బ్రౌన్ కలర్‌లో ఉంటుందని అన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనవసరపు మాటలు మాట్లాడరని చెప్పారు.

అంబటి రాంబాబుకు టిక్కెట్ రాదని, ఆయన సంక్రాంతికి డ్యాన్సులు వేసుకుంటారని పృథ్వీ ఎద్దేవా చేశారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి డ్యాన్సులకు అంబటి రాంబాబును పిలుస్తామని అన్నారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవిగో