Bharat Jodo Yatra: ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర .. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఉదయం కర్ణాటక సరిహద్దు ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం క్షేత్ర గుడి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైంది.

Rahul Gandhi Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఉదయం కర్ణాటక సరిహద్దు ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం క్షేత్ర గుడి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఏపీలో నాలుగు రోజులు పాటు నాలుగు నియోజకవర్గాల్లో రాహుల్ యాత్ర సాగుతుంది.
Bharat Jodo Yatra: పాదయాత్ర ఆపి, వెంటనే ఆ పని చేయమని రాహుల్ గాంధీకి సలహా ఇచ్చిన మాజీ సీఎం
ఉదయం ప్రారంభమైన పాదయాత్ర.. 10-30 గంటలకు ఆలూరు నగర శివారు వరకు యాత్ర కొనసాగుతుంది. 10-30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విరామం. ఈ సమయంలో పలు వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తిరిగి సాయంత్రం 4గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. రాత్రి 7-30 గంటలు మణికుర్తి గ్రామం వరకు రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతుంది. రాత్రి అక్కడే రాహుల్ బస చేస్తారు. నాలుగు రోజుల పాటు ఏపీలో కొనసాగే ఈ యాత్ర రోజుకు 20 కిలో మీటర్ల మేర కొనసాగనుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
బుధవారం (రెండో రోజు) ఏపీలోని ఆదోని నియోజకవర్గం, మూడో రోజు (గురువారం) ఎమ్మిగనూరు, నాలుగో రోజు (శుక్రవారం) మంత్రాలయం నియోజకవర్గాల్లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. తిరిగి కర్ణాటక రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో ఒకరోజు యాత్ర అనంతరం తిరిగి ఈనెల 23న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఏపీలో భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు అన్ని చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రాహుల్ యాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.