MLC Anantha Babu : ఎమ్మెల్సీ అనంతబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఏపీలోని కాకినాడలో  సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ,ఎస్టీ కోర్టు మూడు రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

MLC Anantha Babu : ఎమ్మెల్సీ అనంతబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

mlc anantha babu bail

Updated On : August 22, 2022 / 6:14 PM IST

MLC Anantha Babu :  ఏపీలోని కాకినాడలో  సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ,ఎస్టీ కోర్టు మూడు రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

నిన్న అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందటంతో ఆమె అంత్య క్రియల్లో పాల్గోనేందుకు అనంతబాబుకు రూ. 25 వేల పూచికత్తు, షరతులతో కూడిన మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది కోర్టు.  తిరిగి ఈనెల 25 మధ్యాహ్నం రెండు గంటల లోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

బెయిల్ ఇచ్చిన మూడు రోజులు ఎల్లవరం గ్రామం దాటి బయటకు రావద్దని, పోలీసులు అనంతబాబుతోనే ఉండాలని….సూచించింది. కేసు విషయమై ఎక్కడా ప్రస్తావించకూడదని..  అంత్యక్రియలుకు మాత్రమే అనంతబాబు బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది.

Also Read : Uttar Pradesh : మహిళా జడ్జిని వేధించిన లాయర్-కేసు నమోదు