రాయలసీమ ఎత్తిపోతల టెండర్ ఖరారు

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టెంటర్లను ఆమోదించింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ లిమిటెడ్ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. 3307.07 కోట్లకు కోట్ చేసింది. ఎస్ పీఎమ్ ఎల్ సంస్థ…ఎల్-1 గా నిలిచింది. టెండర్ ఆమోదిస్తూ ఎస్ ఎల్ టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. రివర్స్ టెంటరింగ్ లో దక్కించుకుంది.
088శాతం ఎక్సెస్ కు టెంటర్లను కోట్ చేసి దక్కించుకుంది. పనులు అప్పగించేందుకు కర్నూలు జిల్లా ప్రాజెక్టు సీఈకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి సంబంధించి పరిశీలిస్తే ప్రభుత్వం టెండర్లను 3227.18 అంచనాతో ఇవ్వగా 3340.17 వేశారు.
కాగా శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్(పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్) దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కిమీ వద్దకు ఎత్తిపోసి, తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతలను రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా గత నెల 27న ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం ప్రైస్ బిడ్‌ను తెరిచి, ఈ-ఆక‌్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఈ ప్రక్రియలో 0.88 శాతం అధిక ధర(రూ.3,307.07 కోట్లు)కు కోట్ చేసిన ఎస్పీఎమ్మెల్(జేవీ) ఎల్-1గా నిలిచింది.
నవయుగ, మాక్స్ ఇన్ఫ్రాలతో పోటీ పడి పనులు దక్కించుకుంది. ఈ టెండర్ ప్రక్రియను కర్నూల్ ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి ఎస్‌ఎల్‌టీసీకి పంపారు. ఈ క్రమంలో ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన మంగళవారం విజయవాడలో సమావేశమైన ఎస్‌ఎల్‌టీసీ.. రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ను ఆమోదించింది. ఎల్-1గా నిలిచిన ఎస్పీఎమ్మెల్(జేవీ)కి పనులు అప్పగిస్తూ వర్క్ ఆర‍్డర్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది.