ఏపీలో రికార్డు స్థాయిలో 1,178 కరోనా కేసులు నమోదు, మరో 13మంది మృతి

  • Published By: naveen ,Published On : July 7, 2020 / 02:56 PM IST
ఏపీలో రికార్డు స్థాయిలో 1,178 కరోనా కేసులు నమోదు, మరో 13మంది మృతి

Updated On : July 7, 2020 / 4:33 PM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,178 కొత్త కేసులు నమోదవగా, మరో 13మంది కరోనాతో చనిపోయారు. తాజాగా నమోదైన కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 22మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 21వేల 197కి పెరిగింది. కరోనా మృతుల సంఖ్య 252కి చేరింది. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 11వేల 200. ఇప్పటివరకు 9వేల 745 మంది కోలుకున్నారు.


వరుసగా రెండో రోజూ వెయ్యికిపైగా కేసులు:
కరోనా వైరస్‌తో కర్నూలు జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, విశాఖపట్నంలో ఇద్దరేసి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా నిన్న కూడా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. 1322 మంది కరోనా బారినపడ్డారు. వెయ్యికిపైగా కేసులు రావడం వరుసగా రెండోసారి. కేసుల సంఖ్య గణనీయంగా పెరగడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మరోసారి లాక్ డౌన్ అమలు చేశారు.

Read Here>>కరోనా అనుమానమా, ఈ 3 విషయాలు అందరికీ తెలిసేలా చూడాలని సీఎం జగన్ ఆదేశం