Vijayawada: చికెన్ ప్రియులకు ఊరట.. తగ్గిన ధరలు.. కిటకిటలాడుతున్న నాన్‌వెజ్ మార్కెట్లు
గతవారం వరకు కేజీ రూ.350 పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయి కిలో రూ. 200కు చేరుకుంది. చికెన్ ధరలు తగ్గడం, ఆదివారం కావడంతో బెజవాడ నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడాయి.

Chicken price
Chicken prices : చికెన్ ప్రియులకు ఊరట లభించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు తగ్గాయి. దీంతో ఆదివారం చికెన్ దుకాణాలు కిటకిటలాడాయి. గత కొద్దిరోజులుగా ఏపీలో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వేసవిలో వడగాల్పుల దెబ్బకు భారీగా కోళ్లు చనిపోవటంంతో కోళ్ల సరఫరా తగ్గింది. దీంతో గత నెలలో చికెన్ ధర కిలో రూ. 320 నుంచి రూ. 350 వరకు పలికింది. దీంతో ఆదివారం చికెన్ లేనిదే ముద్దదిగనివారుసైతం వెజ్ కూరగాలతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కొందరు నాన్‌వెజ్ ప్రియులు చేపలవైపు మొగ్గుచూపారు. మరోవైపు చికెన్ ధరలు పెరగడంతో వీకెండ్ లో భారీగా ఉండే చికెన్ అమ్మకాలుసైతం పడిపోయాయి. చికెన్ వ్యాపారులుసైతం గిరాకీలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా చికెన్ ధరలు తగ్గాయి. దీంతో ఆదివారం చికెన్ దుకాణాలు కిటకిటలాటాయి.
Chicken Price: వేసవి ఎఫెక్ట్.. మాంసాహార ప్రియులకు షాక్..
గతవారం వరకు కేజీ రూ.350 పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయి కిలో రూ. 200కు చేరుకుంది. చికెన్ ధరలు తగ్గడం, ఆదివారం కావడంతో బెజవాడ నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా చికెన్ కొనుగోలుదారులు మాట్లాడుతూ.. ఆదివారం వచ్చిందంటే ప్రతిఒక్కరూ చికెన్ తినాలని ఆశపడేవాళ్లం. ధర పెరగడంతో నెలకు ఒక్కసారిమాత్రమే చికెన్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ధర తగ్గడంతో చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మరోవైపు చికెన్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకున్న స్టాక్ అంతా వేస్ట్ అయ్యేదని, కస్టమర్లు వచ్చి ఎక్కువ ధర ఉండటంతో వెనక్కు వెళ్లిపోయేవాళ్లని వ్యాపారులు పేర్కొన్నారు. ప్రస్తుతం చికెన్ ధర తగ్గడంతో గిరాకీ పెరిగిందని చెప్పారు. ఆదివారం కావడంతో చికెన్ కొనుగోలుదారులు దుకాణాల వద్ద పోటెత్తారని వ్యాపారులు తెలిపారు.