Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన టిప్పర్.. చిన్నారిసహా ఏడుగురు దుర్మరణం

Road Accident: ఏపీలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది.

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన టిప్పర్.. చిన్నారిసహా ఏడుగురు దుర్మరణం

Road Accident

Updated On : September 17, 2025 / 2:16 PM IST

Road Accident on national High way in Nellore district : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.

రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టింది. దీంతో టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని వారంతా మృతిచెందారు. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలిలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కారును టిప్పర్ ఢీకొట్టిన తరువాత వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మృతులు ఎక్కడి వారు.. ఎక్కడికి వెళ్లి వస్తున్నారు అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: vahana mitra scheme : ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్.. రూ.15వేలు వీళ్లే అర్హులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి..