Shobha Haimavathi : టీడీపీకి రాజీనామా చేసిన ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి

Shobha Haimavathi : టీడీపీకి రాజీనామా చేసిన ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి

Shobha Haimavathi

Updated On : July 17, 2021 / 11:34 AM IST

Shobha Haimavathi : విజయనగరం జిల్లా ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆమె రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపనున్నారు. ఈమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు పలు కీలక పదవుల్లో పని చేసిన ఆమె కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఆమె కుమార్తె స్వాతి రాణి వైసీపీలో చేరారు.

కాగా కూతురు వైసీపీలో చేరిన నాటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్న హైమావతి శనివారం రాజీనామా చేశారు. అయితే ఈ రోజు ప్రకటించబోయే నామినేటెడ్ పోస్టుల్లో స్వాతి రాణికి కూడా ఒక పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈమె టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

మరోవైపు గతకొంత కాలంగా ఎస్ కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, హైమావతి మధ్య వర్గవిభేదాలు నెలకొన్నాయి. వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇదికూడా ఆమె పార్టీ మార్పుకు ఒక కారణం కావచ్చని తెలుస్తుంది.