Sajjala : సమస్యను తెగే దాకా లాగొద్దు, ఉద్యోగ సంఘాలపై సజ్జల ఆగ్రహం

డిమాండ్లు పెట్టి ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు సజ్జల. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తామని చెప్పి.. ఇప్పటినుంచే సహాయ నిరాకరణ చేయడం సరికాదన్నారు.

Sajjala : సమస్యను తెగే దాకా లాగొద్దు, ఉద్యోగ సంఘాలపై సజ్జల ఆగ్రహం

Sajjala Prc

Updated On : January 27, 2022 / 6:28 PM IST

Sajjala : ఉద్యోగ సంఘాల తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లు పెట్టి ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు సజ్జల. కొన్ని చోట్ల ఆర్థిక అంశాలకు సంబంధించిన ఫైల్స్ ఆపడం క్రమశిక్షణ ఉల్లంఘనే అన్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తామని చెప్పి.. ఇప్పటినుంచే సహాయ నిరాకరణ చేయడం సరికాదన్నారు.

ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఉద్యోగుల కోసం ఎదురుచూస్తామన్నారు. సమస్యను తెగేదాకా లాగడం సరికాదన్నారు. ఇవాళ చర్చలకు వస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు ఎందుకు రాలేదని సజ్జల ప్రశ్నించారు. పర్సనల్ గా ఫోన్ చేసినా చర్చలకు రాకపోవడం దురదృష్టకరం అని వాపోయారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని సజ్జల హెచ్చరించారు. మమ్మల్ని మీరైనా ఒప్పించండి.. లేదా.. మిమ్మల్ని మేమైనా ఒప్పిస్తాం అన్నారు. చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సజ్జల స్పష్టం చేశారు.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

పీఆర్సీ, ఇతర డిమాండ్లపై ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త పీఆర్సీ అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరోమారు ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు సజ్జల. ఉద్యోగ సంఘాల నేతలు ఈ క్షణమైనా రావొచ్చని, చర్చలు జరిపేందుకు సచివాలయంలో మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు.

Back Pain : నడుంనొప్పి బాధించటానికి కారణాలు తెలుసా?

ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు, ఓ మెట్టు దిగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. సచివాలయంలో మంత్రుల కమిటీ రేపు కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.