మూడ్రోజుల్లో పెన్షన్లు పంపిణీ పూర్తవుతుంది.. వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల
కోర్టు పరిధిలోఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు. జగన్ వ్యక్తిత్వంను దెబ్బతీసే వారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో టీడీపీ నేతలు మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వాలంటరీ వ్యవస్థను జగన్ తీసుకువచ్చారు. ఇంటి దగ్గరకే పథకాలు అందిస్తున్నారు. కానీ, రెండేళ్లు నుంచి వాలంటరీ వ్యవస్థ మీద చంద్రబాబు, ఆయన బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదుఇస్తే జనం తరుముతారని, తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాలంటీర్లను తప్పించారు. ఇప్పుడు పెన్షనలకు డబ్బులు లేవని చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన బ్యాచ్ ఎన్ని కుయుక్తులు చేసినా వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరని సజ్జల అన్నారు.
Also Read : Old Woman Dies : పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి.. గంగూరులో ఉద్రిక్తత
వాలంటీర్ల విషయంలో ఏం జరిగిందో ప్రజలకు అంతా తెలుసు. జన్మభూమి కమిటీలు టీడీపీ జలగలతో ఉండేది.. ఇవాళ చంద్రబాబుకు పెన్షనర్లు శాపాలు పెడుతున్నారు. సమాజంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదని సజ్జల అన్నారు. 20మంది అధికారులు వైసీపీ వాళ్లు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారట.. అంటే, బీజేపీ అధికారంలోఉన్న రాష్ట్రాల్లోకూడా అధికారులు వాళ్ల తొత్తులు అయ్యి ఉండాలి కదా అంటూ సజ్జల ప్రశ్నించారు. టీడీపీ కూటమి ఈసీ మీద ఒత్తిడి చేస్తున్నారు.. వారు లొంగిపోతున్నారని సజ్జల ఆరోపించారు. అధికార యంత్రాంగంను ఉపయోగించుకోవాలన్న ఆలోచన వైసీపీకి లేదని సజ్జల చెప్పారు.
Also Read : Pawan Kalyan : పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దు.. కారణం ఏంటంటే
పవన్ కల్యాణ్ ది ఒక రాజకీయ పార్టీనా? అంటూ సజ్జల ప్రశ్నించారు. కూటమి ఇచ్చే హామీలు కూడా గట్టిగా చెప్పడం లేదు. ఇప్పటికే కూటమి మునిగిపోయింది. దివాళా తీసిందని అన్నారు. కోర్టు పరిధిలోఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు. అయిదేళ్లలో వైఎస్ షర్మిల వివేకా హత్య గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ షర్మిల, సునీతతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నాడు. చంద్రబాబు చేతిలో వాళ్లు పావులు అయ్యారు. జగన్ వ్యక్తిత్వంను దెబ్బతీసే వారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.