సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు: సజ్జల

"అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. చంద్రబాబుపై ఉన్న కేసులను కూటమి ప్రభుత్వం మూసివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం" అని అన్నారు.

సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy

Updated On : July 20, 2025 / 3:39 PM IST

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌ రెడ్డి‌ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

“ఇది చంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు. ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్, ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కాం అంటే చంద్రబాబు హయాంలో జరిగింది. ఏడాదికి రూ.1,300 కోట్ల ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. 40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు. 4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు.

చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో బెయిల్ పై ఉన్నారు. ఈ సారి మరింత బరి తెగించి స్కాం చేస్తున్నారు. సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు. ఈ మద్యం కేసులో ఒక్క ఆధారం కూడా లేదు. ఆధారాలు ఇంకా సంపాదిస్తాం అంటారు. ప్రైవేటు మద్యం షాపులు ప్రభుత్వంలోకి మారిస్తే స్కామ్ ఎలా అవుతుంది?

Also Read: ట్విటర్ సృష్టికర్త మరో సంచలనం.. రెండు కొత్త యాప్స్.. ఈ యాప్స్‌ వాడడానికి ఇంటర్నెట్ అక్కర్లేదు..

మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వ అధీనంలోకి షాపులు తెచ్చాం. చంద్రబాబు పాలన కంటే మా హయాంలో మద్యం వినియోగం తగ్గింది. రూ.50 వేల కోట్లు అని మొదట అన్నారు. ఇప్పుడు 3 వేల కోట్లు అంటున్నారు. డబ్బు ఎక్కడుంది అంటే.. మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.

టీవీ సీరియల్ లా సాగదీస్తున్నారు. ఆధారాలు లేవు.. ఇప్పుడేమో సాక్ష్యాలు లేకుండా చేశారని అంటున్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు. చంద్రబాబు స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలతో అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వం నిధులు దారిమళ్లించిన ఆధారాలు ఉన్నాయి.

అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. చంద్రబాబుపై ఉన్న కేసులను కూటమి ప్రభుత్వం మూసివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం” అని అన్నారు.