Anandaiah : సోమిరెడ్డిపై కాకాణి ఫైర్

Anandaiah : సోమిరెడ్డిపై కాకాణి ఫైర్

Anandaiah

Updated On : June 5, 2021 / 8:33 PM IST

Anandaiah : కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ కోసం వెబ్‌సైట్  రూపోందించి డబ్బులు దండుకోవాలని చూశానని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై  సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ..సోమిరెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి సిగ్గు, శరం ఉందా..మేము నిజాయితీగా పుట్టాం .. నీలాగా మేము దోచుకునే బతుకు మాది కాదు…..

నీ దగ్గర నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజారం అంటూ మండిపడ్డారు. ఇప్పటికి నాలుగుసార్లు ఓడిపోయావు, అయినా నీకు సిగ్గు శరం రాలేదు…నీకు దమ్ము ధైర్యం ఉంటే రా… 2024 లో తేల్చుకుందాం…. నిన్ను మట్టి కరిపిస్తాం…. శ్రీనివాస మహల్ ఎదురుగా నువ్వు ఏం చేసేవాడివో గత చరిత్ర లో చూసుకో … ఉఫ్ అంటే ఎగిరిపోయే వాడివి నువ్వు….

పేకాట ఆడి….అందరికీ అప్పులు అయిపోయిన ఘనత సోమిరెడ్డి ది అని ఆయన తీవ్ర పదజాలంతో సోమిరెడ్డిని విమర్శించారు. ఒళ్ళు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. దమ్ముంటే ఎక్కడ తేల్చుకుందామో చెప్పు…. నేను వస్తా….. అంటూ సోమిరెడ్డిని  విమర్శించారు.  సోమిరెడ్డి  ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఊరేగించారు. అయినా నేటికీ సిగ్గు శరం రాలేదు… అంటూ కాకాణి  సోమిరెడ్డిపై  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆనందయ్య మందు కోసం వైబ్‌సైట్ రూపోందించిన సంస్ధ ఎవరిదో మాకు తెలియదని దీనిపై సమగ్ర విచారణ చేయాలని  నేను అధికారులను కోరుతున్నానని కాకాణి చెప్పారు.

[embedyt] https://www.youtube.com/watch?v=ewfLiNeGoI4[/embedyt]