Schools Reopen : ఆగస్టు 2వ వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

జులై నెల చివరి నాటికి రాష్ట్రంలో 10, ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సురేష్ రెండు వారాల్లో హైపవర్ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యం అవుతుందని తెలిపారు.

Schools Reopen : ఆగస్టు 2వ వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

Schools Reopen

Updated On : July 2, 2021 / 5:27 PM IST

Schools Reopen : జులై నెల చివరి నాటికి రాష్ట్రంలో 10, ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సురేష్ రెండు వారాల్లో హైపవర్ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యం అవుతుందని అన్నారు.

జులై15 నాటికి విద్యార్థులకు వర్క్ బుక్స్ అందిస్తామని వివరించారు. పిల్లల తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయి రాబోయే విద్యాసంవత్సరంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆగస్టు 2వ వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని సురేష్ వివరించారు.

ఇక ఆన్ లైన్ క్లాసులపై స్పష్టత ఇచ్చారు సురేష్. ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలలలో సుమారు 60 లక్షల మంది చదువుతున్నారని వారందరికి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. అందరి వద్ద స్మార్ట్ ఫోన్ లేవని కేవలం 10 శాతం మంది విద్యార్థుల వద్దే స్మార్ట్ ఫోన్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

పాఠశాలల ప్రారంభంపై సీఎం జగన్, వైద్యాధికారులుతో త్వరలో చర్చిస్తామని తెలిపారు. ఇక అమ్మఒడి కింద ల్యాప్ టాప్ తీసుకునేందుకు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. వీరికి త్వరలో ల్యాప్ టాప్స్ అందిస్తామని వివరించారు.