Chandrababu : నేరం జరిగినప్పుడు ఉన్న చట్టాలే వర్తిస్తాయన్న ముకుల్ రోహత్గీ, సెక్షన్ 17ఏ చంద్రబాబుకి వర్తిస్తుందన్న సాల్వే- సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు

చంద్రబాబు నిర్ణయాలు, చర్యలు రాష్ట్రంలో అపారమైన అవినీతికి, నష్టానికి దారితీశాయన్నారు. విచారణలోనే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. Chandrababu Case

Chandrababu : నేరం జరిగినప్పుడు ఉన్న చట్టాలే వర్తిస్తాయన్న ముకుల్ రోహత్గీ, సెక్షన్ 17ఏ చంద్రబాబుకి వర్తిస్తుందన్న సాల్వే- సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు

Chandrababu Case

Updated On : October 10, 2023 / 6:09 PM IST

Chandrababu – Mukul Rohatgi : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై మూడో రోజూ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాడీవేడిగా వాదనలు వినిపించారు ఇరుపక్షాల లాయర్లు. ప్రధానంగా సెక్షన్ 17ఏ పై విస్తృతంగా వాదోపవాదాలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపు హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

2014-16 మధ్య కాలంలో ఈ నేరం జరిగిందని, ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పుణెలోని జీఎస్టీ విభాగం జూన్ 2018లో నకిలీ ఇన్ వాయిస్ అంశాన్ని గుర్తించిందని తెలిపారు. పుణె జీఎస్టీ విభాగం ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి లేఖ రాసి డాక్యుమెంట్లు పంపిందని, సెక్షన్ 17ఏ అమల్లోకి రాకముందే నేరం జరిగిందని, విచారణ మొదలైందని వివరించారు.

Also Read : టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో చంద్రబాబు నిందితుడిగా లేరని, రిమాండ్ చేసిన వెంటనే చంద్రబాబు కోర్టుని ఆశ్రయించారని తెలిపారు. అక్కడ కేసు విచారణలో హరీశ్ సాల్వే, సిద్ధార్ధ లూధ్రా ఇద్దరూ వాదనలు వినిపించారని అన్నారు. అక్కడ మెమోతో పాటు డాక్యుమెంట్లు కూడా అందజేశామన్నారు. జరిగిన నేరంపై అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను తీసేస్తే జరిగేది ఏంటిని ప్రశ్నించారు.

నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టమే అమలవుతుందన్నారు ముకుల్ రోహత్గీ. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబు పేరు లేదని, దర్యాఫ్తు తదుపరి దశలో ఏ-37గా చేర్చి చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కాకుండా మరో 36మంది నిందితులు ఉన్నారని, అందులో కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయాలు, చర్యలు రాష్ట్రంలో అపారమైన అవినీతికి, నష్టానికి దారితీశాయన్నారు. విచారణలోనే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. సెక్షన్ 17ఏ అవినీతిపరులకు గొడుగు పట్టడం కోసం కాదని, నిజాయితీపరులకు మద్దతివ్వడం కోసం అని రోహత్గీ వాదించారు.

అంతకుముందు చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే సుదీర్ఘంగా వాదించారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకి వర్తిస్తుందన్నారు. సాధారణంగా జరిగే దర్యాఫ్తునకు రివర్స్ లో విచారణను సీఐడీ ప్రారంభించిందన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం విచారణకు ముందు అనుమతి తీసుకోవాలని, నేరాలు బయటపడ్డాయని కాకుండా ముందస్తు అనుమతి తీసుకుని దర్యాఫ్తు ప్రారంభించాలని అన్నారు. అవినీతి నిరోధక చట్టం లక్ష్యం అవినీతి జరగకుండా చట్టాలు బలోపేతం చేయటం మాత్రమే కాదని దుర్వినియోగం కాకుండా చూసుకోవటం కూడా అన్నారు.

Also Read : చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

యశ్వంత్ సిన్హా కేసులో రిటైర్డ్ జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రత్యేక తీర్పును ఉదహరించారు సాల్వే. రఫెల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ జోసెఫ్ కొట్టివేశారు. నోటీసులు జారీ చేయాలన్న ముకుల్ రోహత్గీ వాదనలు వ్యతిరేకించారు సాల్వే. క్రిమినల్ కేసులో కౌంటర్ అఫిడవిట్ ఎందుకు అని ప్రశ్నించారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ను ప్రస్తావించారు. పోలీసులకు దర్యాఫ్తు చేసే హక్కు లేదని, అది వారి డ్యూటీ మాత్రమే అన్నారు. ప్రజాప్రతినిధి విచారణకు ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, తొలి చర్య చట్టానికి అనుగుణంగా లేకపోతే తర్వాతి పరిణామాలన్నీ చట్టవిరుద్ధమైనవి అవుతాయని సాల్వే వాదించారు.