Seediri Appalaraju: అందుకే చంద్రబాబు మౌనం వహిస్తున్నారు.. మరో కుంభకోణమూ జరిగింది: మంత్రి సీదిరి

చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ ఓ ఏటీఎం అని ప్రధాని మోదీ కూడా అన్నారని చెప్పారు.

Seediri Appalaraju: అందుకే చంద్రబాబు మౌనం వహిస్తున్నారు.. మరో కుంభకోణమూ జరిగింది: మంత్రి సీదిరి

Seediri Appalaraju

Updated On : September 3, 2023 / 7:51 PM IST

Seediri Appalaraju – Chandrababu Naidu: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టి డోపింగ్‌లో దొరికిపోయినట్లు అయిందంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు గుప్పించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉంటున్నారని నిలదీశారు.

ఆయన వ్యవస్థలను నియంత్రించగలడని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో మాయా ప్రపంచాన్ని సృష్టించారని, అది ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. తాత్కాలిక సెక్రటేరియట్‌కే రూ.1,000 కోట్లు పెట్టారంటే ఎవరూ నమ్మలేరని అన్నారు. రెండు బోగస్ కంపెనీలను పెట్టారని ఆరోపించారు.

చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ ఓ ఏటీఎం అని ప్రధాని మోదీ కూడా అన్నారని చెప్పారు. చంద్రబాబు ఇపుడు దొరికిపోయారని, అందుకే మౌనం వహిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా పలు అంశాలను మేనేజ్ చేస్తున్నారు తప్ప సమాధానం చెప్పటం లేదని విమర్శించారు.

చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పవన్ మద్దతు తెలిపిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇదని అన్నారు. ప్యాకేజ్ తీసుకోకపోతే చంద్రబాబుని ప్రశ్నించాలని సవాలు విసిరారు.

One Nation One Election: ముందస్తు ఎన్నికలు ఒట్టి మాటేనా.. ఊహాగానాలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి