Mangoes On Road : రోడ్లపై గుట్టలుగా మామిడి పండ్లు… అసలు కారణం ఇదే!
మామిడి పంట బాగా పండింది.. మంచి గిట్టుబాటు ధర పలికితే చాలు అనుకున్న మామిడి రైతులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది మామి పంట బాగా పండినా గిట్టుబాటు ధర పడిపోయింది. కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో ఎగుమతులకు అవకాశం లేకపోయింది.

Selling Mangoes Dropped By Consumers On Road
Selling Mangoes Dropped By Consumers on Road : మామిడి పంట బాగా పండింది.. మంచి గిట్టుబాటు ధర పలికితే చాలు అనుకున్న మామిడి రైతులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది మామి పంట బాగా పండినా గిట్టుబాటు ధర పడిపోయింది. కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో ఎగుమతులకు అవకాశం లేకపోయింది.
పళ్లకు గిట్టుబాటు ధర కూడా పడిపోయింది. స్ధానిక మార్కెట్‌లోనైనా పంటను విక్రయించే ప్రయత్నం చేసిన రైతులకు చేదు అనుభవం ఎదురవుతుంది. కనీస ధర కూడా పలకపోవడంతో రైతులు తాము తీసుకొచ్చిన మామిడిపళ్లను రోడ్ల పక్కన వదిలి వెళుతున్నారు.
దీనికితోడు ఈదురుగాలలతో కూడిన వర్షాలతో మామిడి పండ్లు చెట్ల నుంచి రాలిపోతూ ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. పంట బాగా పండిందన్న ఆనందంలో ఉన్న మామిడి రైతు అన్ని విధాలుగా చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.
Read:Wrong Chair : పొరపాటు, ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొన్న నెతన్యాహు..వీడియో వైరల్