road accident : శ్రీశైలం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి, ఎనిమిది మందికి గాయలు

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దామరమడుగు వద్ద ఆగి ఉన్న లారీని.. టెంపో ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా..హాస్పిటల్ కు తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

road accident : శ్రీశైలం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి, ఎనిమిది మందికి గాయలు

Seven Killed In Road Accident At Nellore District

Updated On : March 28, 2021 / 7:55 AM IST

Seven killed in road accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. దామరమడుగు వద్ద ఆగి ఉన్న లారీని.. టెంపో ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా..హాస్పిటల్ కు తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం నుంచి చెన్నై వెళ్తుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం యాత్రకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ముంబై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదాలకు నిద్రమత్తు, అతి వేగం కారణమని తెలుస్తోంది.

గాయపడిన వారిని స్థానికులు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఎనిమిది మంది చికిత్స తీసుకుంటున్నారు. ముంబై రహదారిపై ప్రమాదాలు జరగడం తరుచుగా మారింది. ఐదు రోజుల క్రితం టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి పాల వ్యాన్ ఢీకొడంతో ఆరుగురు చనిపోయారు.