Viveka Case : శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోని హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తరలించారు

Viveka Case
Viveka Case : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకోని హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఇటీవల వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో శివశంకర్ రెడ్డి పేరు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వివేకా కూతురు సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల లిస్టులో ఇతని పేరు ఉంది.
చదవండి : YS Viveka : అలా చంపేశాం.. రూ.40కోట్లు సుపారీ.. వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే శివశంకర్ రెడ్డిని పలు మార్లు విచారించారు అధికారులు.. తాజాగా మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసు విచారణ తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. హత్యకేసులు సంబందించిన కారణాలు, కుదుర్చుకున్న సుఫారీతో పాటు హత్యచేసిన వారి పేర్లు, వారికి సహకరించిన వారి వివరాలను సీబీఐ అధికారులు సేకరించిన విషయం తెలిసిందే.
చదవండి : Viveka Murder Case : వైఎస్ వివేకా హత్యకేసు విచారణకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి
వివేకా హత్యకోసం రూ.40 కోట్ల సుఫారీ ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. స్థలం విషయంలో తలెత్తిన వివాదాల కారణంగానే వివేకాను హత్యచేసినట్లు సీబీఐ ధ్రువీకరించిన విషయం విదితమే. ఇక కేసు దర్యాప్తు చివరి దశకు రావడంతో అనుమానితులను మరోసారి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.