బాబువన్నీ తప్పే : శివరామకృష్ణన్ కమిటీ..ఇదిగో వాస్తవాలు

శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో బాబు వెల్లడించిన విషయాలు పూర్తిగా తప్పని మంత్రి బుగ్గన వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సభలో స్పీడ్‌గా చదివి వినిపించారు. రాజధాని విషయంలో కేవలం 15 వందల మంది అభిప్రాయమే తీసుకున్నారని చెప్పారు. విజయవాడ – గుంటూరు రాజధానికి అనుకూలమని కమిటీ చెప్పిందని తెలిపారు. విజయవాడలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉందని, ఇది రియల్ ఎస్టేట్‌కు దారి తీస్తుందని చెప్పారని తెలిపారు.
* 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు.
* ఈ సందర్భంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి.
* అమరావతి రాజధానిలో భూములు ఎవరెవరు కొన్నారో వారి వివరాలను వెల్లడించారు మంత్రి బుగ్గన.
కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయానికి అనుకూలమని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో ఉందన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్‌కు దారి తీస్తుందని, గొప్ప నగరం కట్టేందుకు అనుకూలం కాదని ఉందన్నారు. రాయలసీమలో రాజధానికి అనుకూలమైన భూములున్నాయా ? అని కమిటీ అని అడిగితే..లేదనే విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిందని వివరించారు. ఎత్తైన భవనాలు కట్టడానికి అనుకూలం కాదని నివేదికలో వెల్లడించారనే విషయాన్ని మంత్రి బుగ్గన గుర్తు చేశారు.
* ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం వివరించింది.
* ఇన్ సైడర్ ట్రేడర్ విషయంలో విచారణ జరిపించాలని సీఎంకు సూచించారు స్పీకర్.
* దీనికి సీఎం జగన్ ఒకే చెప్పారు. సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు.
* దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్‌కు అధికారాలు లేవా ? సభ తేల్చాలన్నారు.
* అమరావతి రైతులకు ప్రభుత్వం మేలు చేస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు మంత్రి బోత్స.
* రైతులకు ఎలా మేలు చేస్తామనే విషయాన్ని ఆయన సభలో వివరించారు.
* అమరావతి రాజధానికి ప్రజలు అనుకూలంగా ఉంటే..బాబుతో సహా టీడీపీ సభ్యులు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు వైసీపీ సభ్యులు.
Read More : అమరావతికే జై కొట్టిన శివరామకృష్ణన్ కమిటీ – బాబు