Kurnool : చనిపోయిందని పట్టుకుంటే కాటేసి ప్రాణం తీసింది

Kurnool : చనిపోయిందని పట్టుకుంటే కాటేసి ప్రాణం తీసింది

Kurnool

Updated On : July 3, 2021 / 11:32 AM IST

Kurnool : ప్రాణం పోయిందని పామును పట్టుకుంటే ఒక్కసారిగా బుసకొట్టి కాటు వేసింది. దీంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగస్వామి ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని దూరంగా వదిలేస్తుంటారు.

ఎవరి ఇంట్లోకి పాము వచ్చినా ఇతడికే సమాచారం ఇస్తారు. ఇదే సమయంలో గ్రామంలోని పాఠశాలలోకి ఓ పాము వచ్చింది. విషయం రంగస్వామికి తెలియడంతో పాఠశాల వద్దకు వచ్చి పామును చంపేప్రయత్నం చేశాడు. కర్రతో కొట్టడంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.

చనిపోయిందని చేతిలో పట్టుకొని చూస్తుండగా బుసకొడుతూ కాటు వేసింది. దీంతో రంగస్వామిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.