Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక ఏర్పాట్లు.. కోర్టు కీలక ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కావడంతో జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Chandrababu Jail Arrangements

Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక ఏర్పాట్లు.. కోర్టు కీలక ఆదేశాలు

Chandrababu Jail Arrangements

Updated On : September 11, 2023 / 1:43 AM IST

Chandrababu Jail Arrangements : స్కిల్ స్కామ్ లో విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య చంద్రబాబుని తీసుకెళ్తున్నారు. కాగా, జైల్లో చంద్రబాబుకి ప్రత్యేక వసతులు ఇవ్వాలని, ఇంటి నుంచి భోజనానికి అనుమతించాలని టీడీపీ వేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడించింది.

Also Read..Roja Selvamani : చంద్రబాబు ఇక జీవితంలో బయటకు రారు- టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి రోజా సంబరాలు

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కావడంతో జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకి స్పెషల్ రూమ్ ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది. తగిన భద్రత కల్పించాలంది. అలాగే కావాల్సిన మందులు ఇవ్వాలని, వైద్య చికిత్స అందించాలని, ఇంటి నుంచి భోజనం తీసుకునేందుకు అనుమతించాలని సూచించింది.

చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలని లాయర్లు కోరగా.. అందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. అయితే, రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించాలని, ప్రత్యేక వసతులు కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది. చంద్రబాబుకు అవసరమైన ఔషధాలు, వైద్య చికిత్స అందించాలంది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశించింది.

కాగా, చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో, ఆయనను అధికారులు ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబును ఆయన సొంత కాన్వాయ్ లోనే తరలిస్తున్నారు.