Tirumala : ఆగస్టు 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
అక్టోబరు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆగస్టు 24న విడుదల చేస్తుంది.

tirumala tickets
Tirumala : అక్టోబరు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆగస్టు 24న విడుదల చేస్తుంది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అదేవిధంగా, అక్టోబరు నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఆగస్టు 24న మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.
కాగా, అక్టోబరు నెలకు సంబంధించి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన దర్శనం టికెట్ల కోటా ఆగస్టు 24న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
Also Read : MLC Anantha Babu : ఎమ్మెల్సీ అనంతబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు