Minister Adimulapu Suresh : మంత్రి ఆదిమూలపు మీడియా సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు
మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలెజీ ఘటనపై వివరణ ఇస్తున్న సమయంలో మీడియా సమావేశంలోకి విద్యార్థులు చొచ్చుకొచ్చారు

Minister
Student unions blocked : విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలెజీ ఘటనపై వివరణ ఇస్తున్న సమయంలో మీడియా సమావేశంలోకి విద్యార్థులు చొచ్చుకొచ్చారు. విద్యార్ధి సంఘాల ఆందోళనతో మీడియా సమావేశం నుంచి అర్ధాంతరంగా మంత్రి ఆదిమూలపు బయటకొచ్చారు.
ఆందోళన చేయిద్దని మంత్రి విద్యార్ధి సంఘాలకు సూచించారు. విద్యార్ధులపై జరిగిన దాడి విషయంలో ఇప్పటికే విచారణ జరుగుతుందని విద్యార్ధి సంఘాలకు మంత్రి చెప్పారు. విద్యార్ధులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు మంత్రిని కోరారు.
TDP : టీడీపీ నేతలపై కేసులు నమోదు
పోలీసులు ఆర్ అండ్ బి కార్యాలయానికి చేరుకున్నారు. విద్యార్ధి సంఘాలు నేతలు ఆందోళన చేపట్టారు. పిడిఎస్ యు, టిఎన్ ఎస్ ఎఫ్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.