విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్‌ ను చితకబాదిన ఎస్సై

విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్‌ ను చితకబాదిన ఎస్సై

Updated On : February 4, 2021 / 4:52 PM IST

sub inspector beating PET teacher in Kosigi : కర్నూలు జిల్లాలోని కోసిగిలో పీఈటీ టీచర్ పట్ల ఎస్‌ఐ దౌర్జన్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్‌ ఈరన్నను ఎస్సై ధనుంజయ్ అకారణంగా కొట్టారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో లాఠీతో తీవ్రంగా కొట్టడంతో ఈరన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ ధనుంజయ్‌ తీరు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్‌స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్సై ఈరన్నను విడిచిపెట్టడంతో.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో ఎస్సై లాఠీతో కొట్టాడని బాధితుడు చెబుతున్నాడు. తాను టీచర్‌నని.. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా వినకుండా.. స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ కొట్టారన్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈరన్నను మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యుజి శ్రీనివాసులు పరామర్శించారు. ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.