విశాఖలో ఆత్మహత్య చేసుకున్న యువకుడికి కరోనా పాజిటివ్

విశాఖలో ఆత్మహత్య చేసుకున్న యువకుడికి కరోనా పాజిటివ్

Updated On : June 22, 2021 / 4:18 PM IST

విశాఖపట్నంలో ఈనెల 11 న ఆత్మహత్య చేసుకున్న భూతల శ్రీను మహేష్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంగతి తెలిసే అతను ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

విశాఖలోని శాంతి నగర్ కు చెందిన శ్రీనుమహేష్ (44) ఈనెల11 న నాలుగు అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం జరిపిన శవపరీక్షలో శ్రీను కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

ఈ సంగతి ముందుగానే తెలిసినందున శ్రీను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంగతి తెలిసి శాంతి నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.