Supreme Court..AP govt : ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం..
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులె ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలి నిలిపివేయాలని ఆదేశించింది.

Supreme Court..AP govt sand mining
Supreme Court..AP govt : ఆంధప్రదేశ్ (Andhra Pradesh) లో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం..ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు (Supreme Court)కీలక తీర్పునిచ్చింది. ఇసుక తవ్వకాలు (sand mining)నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి దేశ అత్యున్నత ధర్మాసనంలో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఈ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మార్చి 23న (National Green Tribunal)నిషేధం విధించింది. దీంతో ఎన్జీటీ (National Green Tribunal)విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. అనంతరం ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్టీజీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మానం ఈ కీలక తీర్పునిచ్చింది. ఎన్జీటీ తీర్పును సస్పెండ్ చేయడానికి నిరాకరించటమే కాకుండా ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఏపీలో ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వానికి ఎన్జీటీ విధించిన రూ. 18 కోట్ల జరిమానాపై మాత్రం స్టే విధించింది.
Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేశ్.. అందరి సంగతి తేలుస్తా.. వైసీపీ నేతలకు వార్నింగ్
కాగా ఏపీలో ఇసుక తవ్వకాలను జయ ప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ (Jaya Prakash Ventures Limited)పరం చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. దీంతో సదరు సంస్థ భారీ యంత్రాలతో ఇష్టానురీతిగా ఇసుక తవ్వకాలు కొనసాగించింది. దీంతో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను చేపడుతున్నారని ఎన్జీటీ (NGT) ఏపీ ప్రభుత్వం(AP Govt)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 23న తవ్వకాలపై నిషేధం విధించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. రూ. 18 కోట్ల జరిమానా విధించింది. నదీ తీరాలు, రివర్ బెడ్లలో భారీ యంత్రాలతో తవ్వకాలను అనుమతించడంపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.
కాగా ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు భారీగా పెరిగిపోయాయని ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నాయి. అయినా ఈ విమర్శలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇసుక మాఫియా పెరిగిపోవటంతో సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకపోవటంతో ఎన్ని భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ కార్మికుల ఉపాధిపై దెబ్బపడింది. కార్మికుల కుటుంబాలు ఉపాధి లేక అల్లాడిపోయాయి. ఇసుక మాఫియాతో నేతలు భారీగా ఆస్తులు కూడబెడుతు సామాన్యులకు ఇసుక అందకుండా చేస్తున్నారనే ప్రతిపక్షాలు విమర్శించినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇసుక తవ్వకాలు కొనసాగుతుండగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలినట్లైంది.
Visakhapatnam YSRCP : షాక్ మీద షాక్.. పరిపాలన రాజధాని నగరం వైసీపీకి అచ్చి రావడం లేదా?