CJI NV Ramana : తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈరోజు రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

CJI NV Ramana  : తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ

Supreme Court Chief Justice Nv Ramana Reaches Tirumala

Updated On : June 10, 2021 / 9:36 PM IST

CJI NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈరోజు రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి పుష్పగుఛ్చం ఇచ్చి స్వాగతం పలికారు.  అనంతరం ఎన్వీరమణ దంపతులు శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సీజే ఎన్వీరమణ ఈరోజు రాత్రికి తిరుమలలో బసచేసి, రేపు ఉదయం శ్రీవారి సేవలో పొల్గొంటారు.

ఈరోజు మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఎన్వీ రమణ కుటుంబ సభ్యులకు స్ధానిక అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సీజే ఎన్వీ రమణ, ఆయన అక్క ప్రభంజన రాణితో పాటు ఇతర బంధువులు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.