Naga Babu Ministry : నాగబాబు మంత్రి పదవిపై సస్పెన్స్..! కారణం అదేనా? ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనా?

ఇందులో ఒక దాన్ని నాగబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Naga Babu Ministry : నాగబాబు మంత్రి పదవిపై సస్పెన్స్..! కారణం అదేనా? ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనా?

Naga Babu (Photo Credit : Google)

Updated On : December 18, 2024 / 7:52 PM IST

Naga Babu Ministry : నాగబాబు మంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే, ఆయన ప్రమాణస్వీకారానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముందుగా నాగబాబును ఎమ్మెల్సీగా చేసిన తర్వాతే మంత్రిగా చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూటమిలో మంత్రి పదవిపైన అత్యధిక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకోవడమే. చాలామంది మంత్రి పదవిని ఆశిస్తుండటంతో నాగబాబును ఎమ్మెల్సీగా చేయకుండానే మంత్రిని చేస్తే కొంత అసంతృప్తి రావొచ్చని అధిష్టానం భావిస్తోంది. కూటమిలో బీజేపీ తమకు ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారనే అసంతృప్తితో ఉంది.

దీనికి తోడు జనసేనకు పెద్ద పీట వేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఇక త్వరలో ఏపీ శాసన మండలిలో నాలుగైదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయి. వచ్చే ఏడాది మార్చి 30 తర్వాత 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఇందులో ఒక దాన్ని నాగబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా నాగబాబు ఏప్రిల్ లో ఎమ్మెల్సీ అయితే కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ మంత్రిగా నాగబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు.

 

Also Read : కడప కార్పొరేషన్‌పై టీడీపీ గురి పెట్టిందా? జగన్‌ అడ్డాలో ఫ్యాన్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?